Site icon PRASHNA AYUDHAM

ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు

IMG 20240803 WA0028

*ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాం- మాల మహానాడు నాయకులు*

*జమ్మికుంట /ఇల్లందకుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 3*

ఎస్సీ వర్గీకరణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు తెలుపుతూ ఎస్సీ కులంలో ఉన్న మాలల అందరికీ అన్యాయం చేస్తున్నాయని మాల మహానాడు నాయకుడు మాదాసు మొగిలి అన్నారు గతంలో లేని విధంగా ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు చేయడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని రాజ్యాంగం అమలుపర్చిన నాటి నుండి నేటి వరకు ఎస్సీ వర్గీకరణ ఆర్టికల్ 341 ప్రకారం క్లాస్ వన్ క్లాస్ టు లను అనుసరించి కులాలను నేర్చుకోవడం తీసివేయడం జరుగుతుందని కానీ ఈ ఆర్టికల్ ను ముందు చూపిస్తూ ఎస్సీ దళిత వర్గాలకు ఆయా రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని కానీ వర్గీకరణ పూర్తి చేయాలంటే భారత రాష్ట్రపతి ఎస్సీ కమిషన్ కేంద్ర నాయకత్వం అందరూ కలిసి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం తీసుకోవాలని కానీ అవి ఏవి లేకుండా కేంద్ర ప్రభుత్వ భారత రాజ్యాంగాన్ని విరుద్ధంగా ఈ వర్గీకరణ చేయడం జరిగిందని ఈ వర్గీకరణ జరగడం వలన దళిత మాలలకు మాల ఉపకులాలకు తీరని అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు కేంద్రంలో ఉన్న అన్ని కులాలకు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కులవృత్తి ఉన్నదని కానీ మాల కులానికి ఏ కుల వృత్తి లేదని కులవృత్తి లేని మాల మాల ఉప కులాలకు రాబోవు రోజుల్లో మాల కుల యువతులకు అన్యాయం జరుగుతుందని ఇప్పటివరకు ఈ డబ్ల్యూ ఎస్ పెట్టడం వలన మాలలకు అన్యాయం జరుగుతుందని అది కాకుండా ఓ బి సి వలన కూడా మాకు అన్యాయం జరుగుతుందని కానీ దానికి పక్కన పెట్టి వర్గీకరణ వైపు ముక్కు చూపుతున్నారు దీని పరిణామం రాబోయే రోజుల్లో మాలల పిల్లలకు అన్యాయం జరుగునని దీనిపై ఆలోచించి మాల సోదరులు ఉద్యోగస్తులు ప్రజా ప్రతినిధులు బయటికి వచ్చి పోరాడవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త తీసుకోవాలని అన్నారు ఈ వర్గీకరణ ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరిచిన దేశవ్యాప్త నిరసనలు రాస్తారోకోలు బందులు జరుగుతాయని పేర్కొన్నారు ఈనెల 8 9 10 తేదీల్లో ఢిల్లీలో దేశవ్యాప్త నిరసన జరుగునని తెలిపారు ఇల్లందకుంట మండలంలోని అన్ని గ్రామాల నుంచి మాల సోదరులు కదిలి పోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మాదాసు మొగిలి అంబేద్కర్ సంఘం రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షులు మాదాసు మహేందర్ తెలంగాణ మాల మహానాడు ఉపాధ్యక్షులు భోగం చిరంజీవి కార్యదర్శి జిల్లా మాల మహానాడు తాడెం దిలీప్ మాల మానాడు మండల నాయకుడు గూడెపు జీయర్ స్వామి సీనియర్ నాయకులు భోగం శ్రావణ్ భోగంరాజు భోగం అరుణ్ కుమార్ రాజేందర్ కర్ర విక్కీ కనుమల్లసాగర్ భోగం బిక్షపతి దాసరి సాయి తేజ భోగం కార్తికేయ తదితరులు పాల్గొన్నారు

Exit mobile version