Site icon PRASHNA AYUDHAM

మల్కాజిగిరి పి హెచ్ సి లో అత్యాధునిక దంత వైద్య సేవలు – రోడ్డు ప్రమాద బాధితుడికి విజయవంతమైన శస్త్రచికిత్స

IMG 20250518 WA2367

**మల్కాజిగిరి పి హెచ్ సి లో అత్యాధునిక దంత వైద్య సేవలు – రోడ్డు ప్రమాద బాధితుడికి విజయవంతమైన శస్త్రచికిత్స**

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కృష్ణ ఆయుధం మే 18

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పి హెచ్ సి)లోని అత్యాధునిక దంత వైద్య విభాగం ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ విశేష ప్రశంసలు పొందుతోంది. దంత వైద్య నిపుణుడు డా. పి. వినోద్ నేతృత్వంలో సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు సైతం విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి.

ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 27 ఏళ్ల కార్తిక్‌కు మల్కాజిగిరి పి హెచ్ సి లో అత్యాధునిక వైద్య చికిత్స అందించారు. డా. వినోద్ నేతృత్వంలోని వైద్య బృందం కార్తిక్‌కు పోస్ట్ కోర్ క్రౌన్ పిన్ ఫిక్సేషన్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. అంతేకాకుండా, ఎడమవైపు పైదవడలోని లేటరల్ ఇన్సైజర్ పంటికి రూట్ కెనాల్ చికిత్స (ఆర్.సి.టి) కూడా విజయవంతంగా పూర్తి చేశారు.ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. సి. ఉమ గౌరి మాట్లాడుతూ, ‘‘మల్కాజిగిరి పి హెచ్ సి లో ఈ స్థాయి చికిత్సలు అందుబాటులో ఉండటం డా. వినోద్ నైపుణ్యానికి, ఆయన సేవా దృక్పథానికి నిదర్శనం. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న అత్యుత్తమ నాణ్యతతో కూడిన వైద్య సేవలను వినియోగించుకోవాలి’’ అని పేర్కొన్నారు.

Exit mobile version