Site icon PRASHNA AYUDHAM

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడిగా మల్లా చారి

IMG 20241017 WA0130

*హుజరాబాద్ నియోజకవర్గ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడిగా ఊకంటి మల్లాచారి*

 

*హుజురాబాద్ అక్టోబర్ 17 (ప్రశ్న ఆయుధం)*

 

కరీంనగర్ జిల్లాలో తెలంగాణ ఉద్యమకారుల పోరం హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఊకంటి మల్లాచారిని తెలంగాణ ఉద్యమకారుల పోరం రాష్ట్ర చైర్మన్ చీమ శ్రీనివాస్ నియమిస్తున్నట్లు నియామక పత్రాన్ని విడుదల చేశారు కరీంనగర్ జిల్లాలోని ఇల్లందకుంట మండలం రాచపల్లి గ్రామానికి చెందిన ఊకంటి మల్లాచారి ని తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక పోరాటాలు చేశాడని ప్రజల్లో గుర్తింపు ఉన్న వ్యక్తిగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాడని హైదరాబాద్ ప్రాంత ఉద్యమకారులకు అండగా ఉంటాడని ఈ నియామకాన్ని చేస్తున్నట్లు వారు తెలిపారు అనంతరం మల్లాచారి మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన రాష్ట్ర చైర్మన్ శ్రీనివాస్ కి రాష్ట్ర నాయకులు మోతే ఎల్లారెడ్డి కి ముఖ్య సలహాదారుడు ఓరుగంటి ఆనంద్ కి కరీంనగర్ జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామి కి మండల బాధ్యులకు జిల్లా నాయకులకు ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారునికి కృతజ్ఞతలు తెలిపారు

Exit mobile version