మల్లన్న సాగర్ నిర్వాసితుల పక్షాన అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన చేసి ఆదుకోవాలి
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బండ్ల స్వామి
సిద్దిపేట జూలై 26 ( ప్రశ్న ఆయుధం ) :
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల పక్షాన బడ్జెట్ లో నిధులు కేటాయించి ముఖ్యమంత్రి ప్రకటన చేయడం ద్వారా నిర్వాసితులను ఆదుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బండ్ల స్వామి డిమాండ్ చేసినారు. స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్మించిన మల్లన్న సాగర్ ప్రాజెక్టు మూలంగా అనేక గ్రామాలు ముంపునకు గురైనవి ప్రాజెక్టు భూసేకరణ ప్రారంభ సమయంలో గత ప్రభుత్వం చెప్పిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు, నష్టపరిహారాలు గ్రామ ప్రజల కోసం నిర్మించిన కాలనీలలో సౌకర్యాలు అసంపూర్తిగా ఉన్నవి గత ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు చెప్పిన గుడికి గుడి, బడికి బడి, ఆస్పత్రులు రోడ్లు, మౌలిక వసతులు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైనారు ప్రస్తుత ముఖ్యమంత్రి ఆ సందర్భంలో ముంపు బాధితుల పక్షాన స్వయంగా ఏటిగడ్డ కిష్టాపూర్ లో దీక్ష చేసి మద్దతు తెలిపినారు అనేక బహిరంగ సభలలో ముంపు గ్రామాలకు అన్యాయం జరిగిందని గుర్తు చేసినారు ప్రస్తుతం అధికారంలో వారే ఉన్నందున ఈసారి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో మల్లన్న సాగర్ ముంపు బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తారని ముంపు బాధితులు ఎదురు చూసినారు కానీ అలా జరగలేదు ఇప్పటికే ప్యాకేజీలు నష్ట పరిహారాలు రాక అనేకమంది ముంపు గ్రామాల నిర్వాసితులు మానసిక క్షోభకు గురై కొందరు చనిపోయినారు రోజురోజుకు సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారు ఇప్పటికైనా బడ్జెట్ ను సవరణ చేయడం ద్వారా ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపు మల్లన్న సాగర్ భూబాధితులను ఆదుకోవడానికి ప్రకటన చేసి నిధులు కేటాయించి నిర్వాసితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు ఒకవేళ బడ్జెట్ కేటాయించి ఆదుకొని పక్షంలో బాధితులతో కలిసి వివిధ ప్రజా సంఘాలను ఐక్యం చేసి పోరాటాలు చేయడం ద్వార సాధించుకుంటామని హెచ్చరించారు.