మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ రవికాంత్ మృతి… నివాళులు అర్పించిన ప్రొఫెసరు వసుమతి, టిపియూఎస్ రాష్ట్ర మీడియా సెల్ అధ్యక్షులు ఎర్ర యాకన్న.
ప్రశ్న ఆయుధం జనవరి 16: కూకట్‌పల్లి ప్రతినిధి
అనారోగ్యంతో మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ రవికాంత్ మృతి చెందిన సంఘటన కూకట్పల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామం బరంపురం నుండి కూకట్పల్లి జేఎన్టీయూలో బీటెక్ పూర్తిచేసుకుని ఎంటెక్ తో పాటు పీహెచ్డీ పూర్తిచేసుకుని మల్లారెడ్డి యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ రవి కాంత్ గత 15 రోజుల నుండి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. విషయం తెలుసుకున్న జేఎన్టిహెచ్ ఫారెన్ రిలేషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ వసుమతి తో తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం రాష్ట్ర మీడియా సెల్ అధ్యక్షులు ఎర్ర యాకన్న తోపాటు జె ఎన్ టి యు హెచ్ పిహెచ్డి స్కాలర్స్ ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ శివకుమార్, రాందేవ్ రావ్ ఆస్పటల్ సీఈవో డాక్టర్ యోబు, పీహెచ్డీ స్కాలర్స్ సిద్ధార్థ@నవోదయ సిద్దు, భాస్కర్, రూప్ సింగ్ తో పాటు పలువురు ప్రొఫెసర్లు, మిత్రులు పని రాజ్ ఆయన కుటుంబ సభ్యులకూ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.