మల్లారెడ్డి అల్లుడికి బిగ్ షాక్.. ఇంజినీరింగ్ కాలేజీలకు నోటీసులు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయనకు చెందిన దుండిగల్‌లోని MLRIT, ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు పంపించారు. చిన్నదామర చెరువు FTL, బఫర్ జోన్ పరిధిలో ఈ నిర్మాణాలు చేపట్టారని, దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇవి అక్రమ నిర్మాణాలేనని.. త్వరలోనే వీటిని హైడ్రా కూల్చేయనుందనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇక ఇప్పటికే మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నీలిమ విద్యా సంస్థల నిర్మాణాలపైకి హైడ్రా రాకుండా స్టే ఇవ్వాలంటూ కోర్టుకు వెళ్లారు. అయితే చట్ట ప్రకారం హైడ్రా తనపని తాను చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు హైడ్రా దూకుడుగా వ్యవహారిస్తుంది. ఇప్పటికే హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేసింది. దీనిపై నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు.