కల్తీ కల్లుపై ప్రభుత్వం దృష్టి సారించి కఠినచర్యలు తీసుకోవాలి: మాలోత్ మదన్ లాల్ జాదవ్

కల్తీ కల్లుపై ప్రభుత్వం దృష్టి సారించి కఠినచర్యలు తీసుకోవాలి: మాలోత్ మదన్ లాల్ జాదవ్

కామారెడ్డిలో కల్తీ కల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి

ప్రభుత్వం దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి, జూలై 28 (ప్రశ్న ఆయుధం):

కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు విక్రయాలు తీవ్రమైన స్థాయికి చేరుకున్నాయి. స్థానికంగా వినియోగంలో ఉన్న కల్తీ కల్లు వల్ల పేద ప్రజల ఆరోగ్యాలు పాడవుతున్నాయని, ప్రాణాలు పోతున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలోత్ మదన్ లాల్ జాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు.ఇటీవల తెలంగాణలో కల్తీ కల్లు కారణంగా పది మందికి పైగా మృతిచెందడం, పలువురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఘటనలు హృదయ విదారకమని పేర్కొన్నారు. జిల్లాలో కూడా ఇటువంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయనీ, దీనిపై జిల్లా యంత్రాంగం తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు.ప్రాంతీయ దుకాణాల్లో గణనీయమైన మొత్తంలో కల్తీ కల్లు విక్రయమవుతోందనీ, దీన్ని తయారు చేయడంలో ప్రమాదకర రసాయనాలైన క్లోరల్ హైడ్రేట్, ఆలజోలం, డయాజెపామ్, మిథనాల్, మెగ్నీషియం క్లోరైడ్, యూరియా వంటి పదార్థాలు ఉపయోగిస్తున్నారనీ తెలిపారు. వందల లీటర్ల అసలు కల్లుతో వేల లీటర్ల కల్తీ కల్లు తయారవుతుండడం ప్రజల ప్రాణాలను అటకెక్కించుతోందన్నారు.ఈ దారుణ ఘటనలకు బాధ్యులను కఠినంగా శిక్షించాలని, కల్తీ కల్లు విక్రయాలను తక్షణం నిషేధించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే మరణించిన బాధితుల కుటుంబాలకు రూ. 20 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, కల్తీ కల్లు వల్ల ఆరోగ్యపరిస్థితి దిగజారిన వారికి కనీసం రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని మరియు మెరుగైన వైద్య సహాయాన్ని ప్రభుత్వం అందించాలన్నారు.

Join WhatsApp

Join Now