ప్రాణం కాపాడిన భద్రాచలం మహిశ్రీ అంబులెన్స్ డ్రైవర్ కట్టప్పా

డ్రైవర్
Headlines :
  1. అంబులెన్స్ డ్రైవర్ కట్టప్ప స్వామి ధైర్యంతో మామిడి రాజు ప్రాణాలు కాపాడారు
  2. ప్రాణాపాయంలో అంబులెన్స్ టెక్నీషియన్ నవ్యశ్రీ దక్షత
  3. మామిడి రాజు కుటుంబం నుండి సాహసవంతులకు సన్మానం
  4. ఖమ్మం ఆసుపత్రుల్లో అత్యవసర సేవల ప్రభావం
  5. అంబులెన్స్ సిబ్బందిని మామిడి రాజు కుటుంబం అభినందించింది
  సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా వి. ఆర్. పురం మండలం రేఖపల్లి గ్రామానికి చెందిన టి డి పి నాయకులు మామిడి రాజు కారులో ప్రయాణిస్తున్న సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి చేరుకోగానే స్పృహ కోల్పోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. కొత్తగూడెం వి కేర్ ఆస్పత్రిలో వెంటిలేటర్ సహాయం తో చికిత్స అందించినప్పటికి పరిస్థితి విషమించడంతో భద్రాచలం లోని వెంటిలేటర్ సదుపాయం కలిగిన మహిశ్రీ అంబులెన్స్ లో ఖమ్మం లోని ఆరోగ్య హాస్పిటల్ కి సుమారు రాత్రి 2 గంటల సమయం లో తీసుకెళ్ళారు.అక్కడ నైట్ డ్యూటీ లో వున్న మహిళా డాక్టర్ అంబులెన్స్ వద్దకు వచ్చి పరీక్షించి మరణించినట్లు గా ధ్రువీకరించి వెళ్ళిపొమ్మని చెప్పారు. అనంతరం డిక్లరేషన్ ధ్రువ పత్రం కొరకు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి కి వెళ్ళే సమయం లో అంబులెన్స్ డ్రైవర్ సి పి ఆర్ చేయగా ప్రభుత్వ ఆసుపత్రి నైట్ డ్యూటీ డాక్టర్ ప్రాణం వున్నట్లు నిర్దారించారు.అక్కడ వెంటిలేటర్స్ ఖాళీ లేనందువల్ల దగ్గర లోని స్థంభాద్రి హాస్పిటల్ కి వెళ్ళగా కార్డియాలజిస్టు డాక్టర్ హర్ష అత్యవసర చికిత్స అందించి తిరిగి 12 గంటల లోపు కళ్ళు తెరవడం 24 గంటల లోపు స్పృహలోకి వచ్చేలా చేశారు. మామిడి రాజు ప్రాణం కాపాడిన అంబులెన్స్ డ్రైవర్ కట్టప్ప స్వామిని వారి సతీమణి నర్సింగ్ టెక్నీషియన్ నవ్యశ్రీ ని మామిడి రాజు కుటుంబ సభ్యులు శనివారం మామిడి రాజు ఇంటివద్ద ఘనంగా సన్మానించి నగదు బహుమతి ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో రాజు కుటుంబ సభ్యులు బంధువులు అభిమానులు పాల్గొనివారిని అభినందించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment