ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 15 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురైన వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో జరిగింది. పోలీసుల వివరాలు.. ప్రకారం చెన్నాపూర్ గ్రామానికి చెందిన ఆంజనేయులు కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. గత. కొంతకాలంగా భార్య, పిల్లలు ఇంటి నుంచి వెళ్లిపోవడంతో మద్యానికి బానిస అయ్యాడు. భార్య కాపురానికి రావడం లేదని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు