కుటుంబ కలహాలతో.. రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య..
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ పరిధిలో సోలిపూర్ గ్రామానికి చెందిన సింగపాగ రమేష్ అనే వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్ధానిక రైల్వే ట్రాక్ సమీపంలో చోటు చేసుకుంది. స్టేషన్ మాస్టర్ వెంకట్రావు రైల్వే పోలీస్ మల్లేష్వర్ తెలిపిన వివరాల ప్రకారం సోలిపూర్ గ్రామానికి చెందిన సింగపాగ రమేష్ గత కొంతకాలంగా కుటుంబ కలహాలు చెలరేగడంతో తీవ్ర మనస్థాపానికి గురై, రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని షాద్ నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు..
Post Views: 4