ప్రభుత్వ ఆసుపత్రిలో దివ్యాంగులకు సదరం శిబిరం నిర్వహణ
ప్రశ్న ఆయుధం న్యూస్, డిసెంబర్ 4, కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం సదరం శిబిరం నిర్వహించారు. ప్రతి నెలలో జిల్లాలోని వికలాంగులకు వికలాంగత్వం నిర్ధారణ కొరకు ఈ సదరసం క్యాంపును నిర్వహిస్తారు. దాని ప్రకారం దివ్యాంగులు మొదట మీసేవ కేంద్రాలలో సదరం టోకెన్లు బుక్ చేసుకుని జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని సదరం క్యాంపుకు హాజరవుతారు. బుధవారం ఆర్థోపెడిక్ విభాగంలో 32 మంది దివ్యంగులు హాజరు కాగా, రెన్యువల్ నలుగురు, ఆప్తమాలజీ విభాగంలో ఏడుగురు, సైకియాట్రిస్ట్ విభాగంలో ఐదుగురు, రెన్యువల్ నలుగురు, ఈఎన్ టి విభాగంలో ముగ్గురు, రెన్యువల్ ముగ్గురు, జనరల్ మెడిసిన్ లో 11 మంది, రెన్యువల్ అయిదుగురు క్యాంపులో హాజరయ్యారు. ఈ ఎన్ టి విభాగంలో 25 స్లాట్స్ ఆడియోలోజిస్టు లేని కారణంగా రిపోర్టు కోసం రిఫర్ చేశారు. శిబిరంలో కొత్తగా 58 మంది, రెన్యువల్ విభాగంలో 16 మంది మొత్తం 74 మంది దివ్యాంగులు సదరం శిబిరానికి హాజరయ్యారు. సదరం శిబిరానికి హాజరైన దివ్యాంగులను ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ చంద్రశేఖర్, ఈఏంటి సర్జన్ డాక్టర్ సంతోష్ కుమార్, కంటి వైద్యులు డాక్టర్ కృష్ణ, ఇతర వైద్యుల ఆధ్వర్యంలో దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాసుపత్రిలో దివ్యాంగులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని దివ్యాంగులు కోరారు.