బీజేపీ జిల్లా కార్యాలయంలో సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యశాల నిర్వహణ

*బీజేపీ జిల్లా కార్యాలయంలో సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యశాల నిర్వహణ*

ప్రశ్న ఆయుధం, కామారెడ్డి :

సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి బిజెపి జిల్లా కార్యాలయంలో సంవిధన్ గౌరవ అభియాన్ కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం యొక్క 75 సంవత్సరాల వేడుకలను జరుపుకోవడానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు సంవిధాన్ గౌరవ్ అభియాన్ నిర్వహించబడుతుందని అన్నారు. ఈ వేడుకల ద్వారా భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ కు నివాళులర్పించడంతో పాటు భారత రాజ్యాంగ విలువల గురించి ప్రజల్లో అవగాహన కల్పించబడుతుందని తెలిపారు. భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 26 నవంబర్ 2015న తొలిసారి రాజ్యాంగ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించిందని అప్పటి నుండి ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటూ మనం రాజ్యాంగాన్ని గౌరవించుకుంటున్నామని, నేడు ప్రతి పౌరుడి ఏకైక లక్ష్యం అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడమే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, కౌన్సిలర్ నరేందర్, నాయకులు నంది వేణు, రవీందర్, రాజు, రమేష్ రెడ్డి, శ్రీనివాస్, రాజగోపాల్, భాలమని, మల్లేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now