మంచిర్యాల: కమిషనరేట్ పరిధిలో పట్టుబడిన గంజాయి దహనం
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో 2021 నుంచి వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయిని కరీంనగర్ జిల్లా మానకొండూరులోని ఇన్ఫినేటర్ ఫ్యాక్టరీలో మంగళవారం దహనం చేసినట్లు సీపీ శ్రీనివాసులు తెలిపారు. టాస్క్ ఫోర్స్ పోలీసుల ప్రత్యేక తనిఖీల్లో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో 64 కేసుల్లో పట్టుబడిన 522. 544 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.