మంత్రి లోకేష్‌తో మంచు మనోజ్ భేటీ

*మంత్రి లోకేష్‌తో మంచు మనోజ్ భేటీ*

చిత్తూరు, జనవరి 15: హీరో మంచు మనోజ్ బుధవారం నారావారిపల్లెకు చేరుకున్నారు. విద్య, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌తో మంచు మనోజ్ భేటీ అయ్యారు. కాగా.. గత రోజులుగా మంచు ఫ్యామిలీలో జరిగిన పరిణామాలు తీవ్ర రచ్చకు దారి తీసిన విషయం తెలిసిందే. మోహన్ బాబు తనయులు మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. నిన్నటి నుంచి మోహన్‌ బాబు కాలేజీ వద్ద, నారావారిపల్లె వరకు మంచు ఫ్యామిలికీ సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఓవైపు మనోజ్, విష్ణు ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే నిన్న రాత్రికి రాత్రి మంచు మనోజ్‌కు సంబంధించి ఫ్లెక్సీలను తొలగించేశారు.

సుమారు వంద వరకు ఉన్న ఫ్లెక్సీలను తొలగించేశారు. ఈ క్రమంలో మనోజ్ కాలేజ్‌కు వస్తున్నారనే సమాచారంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి మనోజ్ పర్యటన అత్యంత ఉత్కంఠను రేపుతోంది. అయితే మంచు మనోజ్ నేరుగా నారా వారిపల్లెకు చేరుకుని నారా లోకేష్‌తో భేటీ అయ్యారు. మరోవైపు ఈరోజు ఉదయం నుంచి మోహన్‌ బాబు తిరుపతి కాలేజ్ వద్ద తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకుంది. మోహన్‌ బాబు కాలేజ్‌కు మనోజ్ వస్తారన్న సమాచారంతో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే మంచు మోహన్ బాబు, విష్ణు కాలేజ్ వద్దే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.

కుంభమేళాకు వెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

మరోవైపు మంచు మనోజ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా మోహన్ బాబు కాలేజీలోకి అనుమతి లేదని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. న్యాయస్థానంలో కేసు ఉన్న కారణంగా కాలేజీ ప్రాంగణంలోకి మనోజ్‌కు అనుమతి లేదని కోర్టు ఉత్తర్వులు మనోజ్‌కు పోలీసులు అందజేశారు. పోలీసులు నోటీసులు ఇవ్వడంతో కాలేజీలోకి వెళ్లకుండానే మనోజ్ నారావారీ పల్లెకు చేరుకున్నారు. లోకేష్‌తో భేటీ అనంతరం తిరిగి రంగంపేటలో జల్లికట్టు జరగనున్న ప్రాంతంకీ మనోజ్ వెళ్లనున్నారు.

మరోవైపు మనోజ్ కాలేజ్‌లోకి రావొద్దంటూ మోహన్‌ బాబు ఇప్పటికే కోర్టులో ఇంజెక్షన్ పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు పరిగణలోకి తీసుకుని అనుమతినిచ్చింది. దీంతో మనోజ్ కాలేజ్‌ వద్దకు వెళ్లిన సమయంలో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. కాలేజ్‌కు ఉన్న నాలుగు గేట్ల వద్దకు మనోజ్ వెళ్లి.. అక్కడి పోలీసులతో మాట్లాడారు. వారి వద్ద నుంచి సమాచారం తీసుకున్నారు. ఈ వ్యవహారం మొత్తాన్ని తన ప్రైవేటు సెక్యూరిటీ, కెమెరామెన్‌లతో వీడియో తీయించారు మనోజ్. మనోజ్‌ పాటు ఆయన భార్య మౌనిక కూడా కాలేజీ వద్దకు వెళ్లారు. అయితే కాలేజ్‌లోకి అనుమతి లేకపోవడంతో అక్కడి నుంచి నారావారిపల్లెకు వెళ్లిన మనోజ్.. భార్యతో కలిసి మంత్రి లోకేష్‌ను కలిశారు..

Join WhatsApp

Join Now