కె పి హెచ్ బి కాలనీ రమ్య గ్రౌండ్ లో వాకింగ్ ట్రాక్ ను పునర్ నిర్మిస్తున్న మందడి శ్రీనివాసరావు
ప్రశ్న ఆయుధం జనవరి 11: కూకట్‌పల్లి ప్రతినిధి
కె పి హెచ్ బి కాలనీ 114 డివిజన్ పరిధిలో ఉన్న మూడో ఫేసు రమ్య గ్రౌండ్లో వాకింగ్ ట్రాక్ వేసి సుమారుగా 15 సంవత్సరములు దాటిపోయింది ఆ వాకింగ్ ట్రాకు పాడైపోయి వాకింగ్ చేయటానికి వీలు లేకుండా మట్టి పెరుగుపోయి ఉన్నందున ఆ వాకింగ్ ట్రాక్ ను పునర్ నిర్మించి ఉపయోగకరంగా చేయండి అని కాలనీ వాసులు కార్పొరేటర్ వద్దకు వెళ్లి చెప్పటం జరిగినది. కార్పొరేటర్ వెంటనే స్పందించి వాకింగ్ ట్రాక్ ని పరిశీలించి వారు తమ సొంత ఖర్చులతో నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగింది. కాలనీ వాసులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ శివశక్తి కల్చరల్ అసోసియేషన్ కమిటీ సభ్యులు కట్టా నరసింగరావు, కాముని నర్సింహారెడ్డి, వాసిరెడ్డి లక్ష్మీనారాయణ, జాలారి శివ, నారాయణ రావు, రవీందర్ రెడ్డి, కొండారెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.