సంగారెడ్డి/పటాన్ చెరు, మార్చి 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఇటీవల ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించడంతో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి గుమ్మడిదల మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు నవీన్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ములు గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. మాట్లాడారు. ఎస్సీ వర్గాల హక్కుల కోసం మందకృష్ణ మాదిగ అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. వర్గీకరణ కోసం చేసిన దీర్ఘకాల పోరాట ఫలితంగా బిల్లు ఆమోదించబడిందని, ఇది వర్గీకరణ కోసం పోరాడుతున్న ప్రజలకు విజయపథంగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కుమార్ గౌడ్, దేవాలయ కమిటీ అధ్యక్షుడు మద్దుల బాలరెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు అమ్మగారి సదానంద రెడ్డి, వర్తక సంఘం అధ్యక్షుడు ఆకుల సత్యనారాయణ, యువజన నాయకుడు మంద భాస్కర్ రెడ్డి, అలాగే ఉదయ్ కుమార్, కరుణాకర్, శ్రావణ్ రెడ్డి, బొంతపల్లి సుదర్శన్, సత్యనారాయణ, తుడుం రవి, ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.