*మండల స్థాయి సాంఘిక శాస్త్ర ప్రతిభా పరీక్ష పోటీలు*
*ఇల్లందకుంట డిసెంబర్ 30 ప్రశ్న ఆయుధం:*
సోమవారం రోజున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇల్లందకుంటలో మండల స్థాయి సాంఘిక శాస్త్ర ప్రతిభ పోటీలను నిర్వహించారు దీనిలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలు, కస్తూరిబా పాఠశాలలు, మోడల్ స్కూల్స్ విద్యార్థులకు ఇల్లందకుంట మండల స్థాయి సాంఘిక శాస్త్ర ప్రతిభా పరీక్ష పోటీలను కే. మల్లారెడ్డి స్కూల్ అసిస్టెంట్ సోషల్ వంతడుపుల ఏ. మనోహర్ రెడ్డి స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఇల్లందకుంట సమక్షంలో నిర్వహించారు
ఈ ప్రతిభ పరీక్షలకు మండలంలోని ప్రతి పాఠశాల నుండి ముగ్గురు విద్యార్థులు హాజరు కావడం జరిందని ప్రతిభా పరీక్షలలో ప్రథమ స్థానం ఎం. నాగరాజు జడ్పీహెచ్ఎస్. ఇల్లందకుంట, ద్వితీయ స్థానం ఓ. గణేష్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇల్లందకుంట, తృతీయ స్థానం సిహెచ్. అఖిలేశ్వర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇల్లందకుంట విద్యార్థులు కైవసం చేసుకున్నారు. కేజీబీవీ రెసిడెన్షియల్ పాఠశాలల నుండి ప్రథమ స్థానం ఉప్పుల శ్రీచక్ర కేజీబీవీ ఇల్లందకుంట పాఠశాల, ఎం. అనుదీప్ ద్వితీయ స్థానం టిఎస్ మోడల్ స్కూల్ టేకుర్తి కైవసం చేసుకుని జిల్లా ప్రతిభా పరీక్షలకు ఎంపిక కావడం జరిందని తెలిపారు
ఇల్లందకుంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే. జయప్రకాష్ మాట్లాడుతూ విద్యార్థులను అభినందించి ప్రశంస పత్రాలను విద్యార్థులకు అందజేయడం జరిగిందని తెలిపారు రానున్నటువంటి పదవ తరగతి పరీక్షలలో మంచి మార్కులను సాధించి పాఠశాలకు వారి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులను అభినందించారు.
ఈ కార్యక్రమానికి వివిధ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.