విజేతలకు శుభాకాంక్షలు తెలిపిన హెచ్ఎం, కన్వీనర్ రవిలాదేవి….
బూర్గంపహాడ్ మండల స్థాయి క్రీడా పోటీలు ఈ నెల 19, 20 తేదిలు అనగా గురు, శుక్ర రెండు వారాలు విజయవంతంగా జరిగి ముగిశాయి. బూర్గంపహాడ్ మండల స్థాయి పాఠశాల క్రీడా పోటీల్లో విజేతల యొక్క వివరాలను విడుదల చేసిన వివరాలు ఇలా ఉన్నాయి. సీనియర్ కబడ్డీ విభాగంలో మొదటి బహుమతి ఎంజెపిటిబిసి భద్రాచలం కాగా ద్వితీయ బహుమతి ప్రగతి స్కూల్ సారపాక కైవసం చేసుకుంది. అదేవిధంగా సీనియర్ ఖోఖో విభాగంలో మొదటి బహుమతి ఎంజెపిటిబిసి భద్రాచలం కాగ రెండవ బహుమతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల నకిరిపేట కైవసం చేసుకుంది. సీనియర్ వాలీబాల్ విభాగంలో మొదటి బహుమతి ఏహెచ్ఎస్ ఉప్పసాక కాగ రెండవ బహుమతి జడ్పిహెచ్ఎస్ మొరంపల్లి బంజర కైవసం చేసుకుంది. అదేవిధంగా జూనియర్ విభాగంలో కబడ్డీ క్రీడలో మొదటి బహుమతి జిహెచ్ఎస్ బూర్గంపహాడ్ కాగ రెండో బహుమతి జడ్పిహెచ్ఎస్ సారపాక కైవసం చేసుకుంది. ఖోఖో క్రీడలో మొదటి బహుమతి జెడ్పిహెచ్ఎస్ నకిరిపేట కాగ రెండవ బహుమతి ఎంజెపిటిబిసి భద్రాచలం కైవసం చేసుకుంది. వాలీబాల్ క్రీడలో మొదటి బహుమతి ఏహెచ్ఎస్ ఉప్పుసాక కాగ రెండవ బహుమతి జడ్పీహెచ్ఎస్ మొరంపల్లి బంజర కైవసం చేసుకుంది. అదేవిధంగా అథ్లెటిక్స్ క్రీడల యందు 100 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్, షాట్ పుట్ అంశాల్లో ఎంజెబిటిబిసి భద్రాచలం, ఏహెచ్ఎస్ ఉప్పసాక, ప్రగతి స్కూల్, జడ్పీహెచ్ఎస్ నకిరేపేట, జిహెచ్ఎస్ బూర్గంపహాడ్ క్రీడాకారులు తమ ప్రతిభను చూపారని, మండల స్థాయి క్రీడలు ఇంత దిగ్విజయంగా నిర్వహించడంలో సహకరించిన వ్యాయామ ఉపాధ్యాయులకు, విజేతలైన క్రీడాకారులకు ధన్యవాదములు అభినందనలు తెలియజేసినట్లు బూర్గంపహాడ్ మండల స్థాయి క్రీడలకు కన్వీనర్ రవిలాదేవి తెలియజేశారు. క్రీడలు ముగింపు సందర్భంగా జరిగిన అభినందన సభలో మండల స్థాయి క్రీడల ఆర్గనైజర్ పి. విద్యాసాగర్ తో పాటు వ్యాయామ ఉపాధ్యాయులైన యనమదల వేణుగోపాల్, బైటి బాబురావు, బి కృష్ణ, ఏం రాము, ఈశ్వర్, పూర్ణచంద్రరావు, మల్లికార్జున్, జనార్ధన్ తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.