ప్రశ్న ఆయుధం న్యూస్ జనవరి 12 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్ ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ను మర్యాద పూర్వకంగా కలిశారు. మహేశ్ గౌడ్ ను శాలువాతో సన్మానించి నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని దిశ నిర్దేశం చేశారు.