Headlines
-
మంగళగిరి: ఇంటింటికీ వంట గ్యాస్!
-
నగరపాలక సంస్థ అనుమతులతో మంగళగిరిలో గ్యాస్ పైపులైన్ పంపిణీ
-
మంగళగిరిలో వినియోగదారుల పేర్లు నమోదు: ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్
-
నారా లోకేశ్ ఆదేశంతో మంగళగిరిలో పైపులైన్ గ్యాస్ పంపిణీ ప్రణాళిక
-
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్న మంగళగిరి గ్యాస్ కనెక్షన్ సౌకర్యం
అమరావతి :
మంగళగిరి – తాడేపల్లి నగర పాలక సంస్థ (MTM)లో పైపులైన్ ద్వారా ఇంటింటికీ వంట గ్యాస్ పంపిణీకి అనుమతివ్వాలని నగరపాలక సంస్థకు మంత్రి నారా లోకేశ్ ఆదేశాలు జారీ చేశారు. నగరపాలక సంస్థ అనుమతులు ఇవ్వడంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ నెల రెండో వారంలో వినియోగదారుల పేర్లు నమోదు చేస్తారు.ఎవరెవరి ఇంటికి గ్యాస్ కనెక్షన్ కావాలని ముందుకు వచ్చిన వారి ఇళ్లకే పైపులైన్ వేస్తారు.