ఐ ఎన్ టి యు సి ఆధ్వర్యంలో మణుగూరు ఏరియా డీజిఎం పర్సనల్ రమేషకు ఘన సన్మానం

ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 2 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మణుగూరు ఏరియా ఉత్తమ అధికారిగా ఎంపికై కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం ఐ ఆర్ ఎస్ చేతుల మీదుగా సన్మానించబడ్డ మణుగూరు ఏరియా అధికార ప్రతినిధి డీజీఎం పర్సనల్ సలగల రమేష్ ని ఆదివారం నాడు మణుగూరు ఏరియా ప్రాతినిధ్య సంఘం సింగరేణి కాల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐ ఎన్ టి యు సి)ఆధ్వర్యంలో పుష్పగుచ్చం శాలువా మిఠాయిలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఐ ఎన్ టి యు సి మణుగూరు ఏరియా ఉపాధ్యక్షులు వత్సవాయి కృష్ణంరాజు మాట్లాడుతూ మాట కఠినమైన మనసు సున్నితమని మణుగూరు ఏరియా కార్మికుల సంక్షేమానికి సంబంధించి కార్మికుల మరియుకార్మిక సంఘాల విజ్ఞప్తులను యాజమాన్యం దృష్టికి తీసుకుని వెళ్లి అవి పరిష్కరించే దిశగా ప్రయత్నించే వ్యక్తులలో రమేష్ ముందు వరుసలో ఉంటారని రమేష్ సేవలను నిజాయితీ నిబద్ధతలను వారు కొనియాడారు.ఉద్యోగపరంలో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షిస్తూ ఉత్తమ అధికారిగా ఎంపికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఏరియా ప్రధాన కార్యదర్శి సిల్వేరు గట్టయ్య మాట్లాడుతూ ఉత్తమ అధికారిక ఎంపికైన స్ఫూర్తితో సింగరేణి యాజమాన్యం నుండి ఏరియా కార్మిక వర్గానికి మరిన్ని సంక్షేమ ఫలాలు అదే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి ఏరియా ఉపాధ్యక్షులు వి కృష్ణంరాజు,బ్రాంచ్ కార్యదర్శి కార్యదర్శి సిల్వేరు గట్టయ్య యాదవ్, షేక్ అబ్దుల్ రవూఫ్, ఎండి షాబుద్దీన్, భానోత్ కృష్ణ, బుర్రావెంకటేశ్వర్లు,మల్లికార్జున్, రామారావు, సిహెచ్ అశోక్, అజిత్,తిరుపతి,చిలుముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment