Site icon PRASHNA AYUDHAM

మట్టిలో మాణిక్యం కెస్త శివకుమార్…

నిజామాబాద్ జిల్లా (ప్రశ్న ఆయుధం)
ఎడపల్లి నవంబర్ 17:

ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ యువకుడు కేస్త శివకుమార్ వ్యవసాయ శాఖలో ఉద్యోగం సాధించడం ఎంతో గర్వించదగ్గ విషయమని జాన్కంపేట్ గ్రామ పెద్దలు పేర్కొన్నారు. జాన్కంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో శివకుమార్ ను సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు మాజీ చైర్మన్ లు, డైరెక్టర్ లు శివకుమార్ ను శాలువా పుల మాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం సంఘం అధ్యక్షులు మిద్దె నరేందర్ మాట్లాడుతూ…. జానకంపేట్ గ్రామానికి చెందిన కేస్త సత్యనారాయణ కుమారుడు శివకుమార్ ప్రభుత్వ ఉద్యోగం సాధించి అటు తల్లిదండ్రులతో పాటు ఇటు గ్రామానికి గుర్తింపు తీసుకువచ్చారని అన్నారు. గ్రామ యువకులు సైతం శివకుమార్ ను ఆదర్శంగా తీసుకొని తమ జీవితాల్లో స్థిరత్వాన్ని ఏర్పరుచుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగ సాధనకు కృషి చేయాలని అన్నారు. తమ జీవితాల్లో అత్యున్నత శిఖరాన్ని చేరడానికి చిన్ననాటి నుండి ప్రణాళికలు రూపొందించుకోనీ, వాటినీ అమలు పరుస్తూ తాము నిర్దేశించుకున్న లక్ష్యం వైపు పయనించి తాము అనుకున్నది సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు దాసరి ఒడ్డెన్న, మాజీ చైర్మన్లు చిక్కల లక్ష్మణ్, విజయ్ కుమార్ గౌడ్, పేపర్ లక్ష్మణ్, తాజా మాజీ ఉపసర్పంచ్ వెల్మల విజయ్, గ్రామ పెద్దలు రాధా కిషన్ గౌడ్, చిలుక నారాయణ, లింగం, సాయిలు, నర్సయ్య సంగం కార్యదర్శి గంగా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version