విస్తరాకు లాంటిది..మనిషి జీవితం మిత్రమా

విస్తరాకు లాంటిది..మనిషి జీవితం మిత్రమా.. 

IMG 20241013 WA0035

 *_”విస్తరాకును”_* _ఎంతో శుభ్రంగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని_ *_’భోజనానికి’_* _కూర్చుంటాము._

 

_భోజనము తినేవరకు_ *_”ఆకుకు మట్టి”_* _అంటకుండా జాగ్రత్త వహిస్తాము._

 

_తిన్న మరుక్షణం_ *_’ఆకును’ (విస్తరిని)_* _మడిచి_ *_దూరంగా’_* _పడేస్తాం._ 

 

 *_”మనిషి జీవితం”_* _కూడా అంతే ఊపిరి పోగానే_ *_”ఊరి బయట”_* _పారేసి వస్తాము.._  

 

*_’విస్తరాకు’_* _పారేసినప్పుడు సంతోషపడుతుంది. ఎందుకంటే_ *_’పొయేముందు ఒకరి ఆకలిని’_* _తీర్చటానికి తను ఉపయోగపడ్డానులే అన్న_ *_’తృప్తి_’* _ఆకుకు ఉంటుంది._

 

 *_’సేవ’_* _చేసే అవకాశము వచ్చినపుడు మీరు అందరూ_ *_’సేవ’_* _చేయండి._

 

 _మళ్లీ ఎప్పుడైనా చేయవచ్చులే అనుకొని_ *_”వాయిదా”_* _వేయకండి._

_ఆ అవకాశము మళ్లీ వస్తుందని అనుకుంటే_ *_’కుండ’_* _ఎప్పుడైనా పగిలిపోవచ్చు. అప్పుడు_ *_’విస్తరాకుకు’_* _ఉన్న_ *_’తృప్తి’_* _కూడా మనకి ఉండదు..__ఎంత_ *_’సంపాదించి’_* _ఏమి లాభం..?_ *_’ఒక్కపైసా’_* _కూడా తీసుకుపోగలమా..?_ _కనీసం_ *_’మన ఒంటిమీద బట్ట’_* _కూడా మిగలనివ్వరు.._  అందుకే.._ *_’ఊపిరి’_* _ఉన్నంత వరకు_ *_”నలుగురికి”_* _ఉపయోగపడే విధంగా_ *_’జీవించండి’…_ _ఇదే జీవిత సత్యం.. *

Join WhatsApp

Join Now