మణుగూరు ఏరియా ప్రైవేటు కన్వీనెన్స్ వాహన డ్రైవర్లకు చట్టబద్ధ హక్కులు కల్పించాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ మణుగూరు సామాజిక సేవకులు కర్నే బాబురావు శనివారం నాడు
ఏరియా ఇన్ ఛార్జ్ ఎస్ ఓ టు జి ఎం వెంగళరావు గారికి వినతి పత్రం అందజేసినట్లు సామాజిక సేవకులు కర్నే బాబురావు విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మణుగూరు ఏరియా సింగరేణి లో ప్రైవేట్ కన్వీనేన్స్ వాహనాలు అంబులెన్స్ లు, స్కూల్ బస్ లు, ట్రాక్టర్ డోజర్లు, గూడ్స్ వాహనాలు పనిచేస్తున్నాయి. వీరికి చట్టబద్ధ హక్కులు అమలు కావడం లేదన్నారు. ప్రైవేట్ కన్వీనెన్స్ వాహనాలకు సంబంధించి సింగరేణి సామాజిక బాధ్యతలో భాగంగా భూ నిర్వాసితులకు వాహన టెండలు ఖరారు చేస్తున్నారు. కానీ ఆచరణలో గుడ్ విల్ పేరుతో వారికి కొంత సమయం చెల్లించి అట్టి వాహనాలను బడా బాబులు బినామీ పేర్లపై నడుపుకుంటున్నారు. కొత్తగూడెం కి చెందిన ఒక బడా కాంట్రాక్టర్ చేతిలోనే 40 వాహనాలు ఒక మణుగూరులోనే నడుస్తున్నాయి అంటే ఎంత పెద్ద వెహికల్ మాఫియా నడుస్తున్నదో అర్థం చేసుకోవచ్చు మాఫియా అయితే కావచ్చు కానీ ఆ వాహనాలపై పనిచేస్తున్న డ్రైవర్లకు చట్టబద్ధహక్కులలో భాగంగా సెంట్రల్ జీవో ప్రకారం వేతనాలు కానీ, సి ఎం పి ఎఫ్ కానీ, బోనస్ కానీ అమలు కానీ దుస్థితి. వీటి గురించి ఎవరైనా డ్రైవర్ ప్రశ్నిస్తే వారి ఉద్యోగం గల్లంతు అవుతున్న పరిస్థితి వేరే వాహనాన్ని కూడా డ్యూటీ ఎక్కనివ్వరు.దీనితో డ్రైవర్లు భయపడి తమ వేతనాల కోసం ఏ కార్మిక సంఘం నాయకులను కూడా ఆశ్రయించలేని దౌర్భాగ్య పరిస్థితులలో మణుగూరు ఏరియా డ్రైవర్లు బిక్కు బిక్కుమంటూ భయపడి బ్రతుకుతున్నారు. ఇది బహిరంగ రహస్యం అంతేకాకుండా కొన్ని సందర్భాలలో సింగరేణి సంస్థ పైన కూడా వీరు ఏకఛత్రాధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఉత్పత్తి పైన కూడా దీని ప్రభావం మీకు తెలియనిది కాదు ఇలా వీరు బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతున్నారు. దయచేసి సింగరేణి యాజమాన్యం ఒక కమిటీని వేసి మణుగూరు ఏరియా ప్రైవేటు వాహన డ్రైవర్లకు అమలవుతున్న చట్టబద్ధ హక్కుల అమలుకు సంబంధించి నిజ నిర్ధారణ చేయాలని నిత్యం అధికారులతో పాటు వారి వెన్నంటి నడుస్తూ రోడ్డు భద్రత సూత్రాలు పాటిస్తూ జాగ్రత్తగా వాహనాన్ని నడిపిస్తూ అతి తక్కువ వేతనాలతో ఇబ్బందులకు గురి అవుతున్న ప్రైవేటు కన్వీనెన్స్ వాహన డ్రైవర్లకు న్యాయం చేయాలని కోరుతున్నానన్నారు.హైకోర్టు తీర్పును అనుసరించి సీఎం పిఎఫ్ కచ్చితంగా అమలు చేయాలి, డ్రైవర్లను వేధించవద్దు . డ్రైవర్లు అందరికీ సింగరేణి ఉచిత వైద్య పాస్ బుక్ లు అందజేయాలి.కాలనీలో ఖాళీగా ఉన్న క్వార్టర్లు ప్రైవేటు వాహన డ్రైవర్లకు కేటాయించాలి .సింగరేణిలో టీ టిఫిన్ లకు, 30 రూపాయల భోజనానికి ప్రైవేటు వాహన డ్రైవర్లను అనుమతించాలి. ఉచిత యూనిఫామ్ అందజేయాలి. ప్రమాద బీమా 30 లక్షల రూపాయల స్కీమ్ తప్పనిసరిగా అమలు చేయాలి.ఈ విషయమై కేంద్ర కార్మిక శాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు