Site icon PRASHNA AYUDHAM

ఎం సి పి ఐ యు పార్టీలొ పలువురి చేరిక.

IMG 20250705 WA0231

ఎం సి పి ఐ యు పార్టీలొ పలువురి చేరిక.

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూలై 5

 

ఎం సి పి ఐ యు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక కార్యాలయంలో శనివారం రోజు వివిధ పార్టీలకు చెందిన పలువురు ఎం సి పి ఐ పార్టీ ప్రజా సంఘాలు చేసే కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరారని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రణం సుధాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎం సిపిఐ యూ పార్టీ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ అని అనేక ఆటుపోట్లు ఎదుర్కొని, రాష్ట్రంలో దేశంలో అంచలంచెలుగా ఎదుగుతూ, ప్రతి ఒక్కళ్ళ మందనం పొందుతూ ముందుకు సాగుతుందని అన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక సమస్యల పైన ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇవ్వాలని డబుల్ బెడ్ రూమ్ లో ఇవ్వాలని, భూ సమస్యలు పరిష్కరించాలని బీడీ కార్మికుల సమస్యలు, భవన నిర్మాణరంగా కార్మికుల సమస్యలు, పరిష్కరించాలని అనేక ఉద్యమాలు చేసిందని, ఆ పోరాట ఫలితంగానే ఈరోజు పార్టీకి ఆకర్షితులై అనేకమంది హింసిపిఐ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు సామాజిక న్యాయం ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న పార్టీ ఎం సిపిఐ పార్టీ అని ఆయన అన్నారు. అలాగే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీతోపాటు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని వేణు పక్షంలో పెద్ద ఎత్తున భాషార్థం ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాలు విచారించారు అలాగే పార్టీలో చేరిన వారికి శుభాకాంక్షలు. చేరిన వారిలో బాల్ సింగ్ నాయక్, గంగయ్య, నర్సింలు, ప్రభాకర్, నితిన్,సుమన్, ఉన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జబ్బర్ నాయక్, జిల్లా కమిటీ సభ్యులు నర్సింలు, సత్తయ్య, స్వామి, ప్రసాద్, సునీత, మంజుల, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version