చాలా మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతుంటారు.

చాలా మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారు కొన్ని ఇంటి చిట్కాలతో చక్కని నిద్రని సొంతం చేసుకోవచ్చు. వీటిని రెగ్యులర్‌గా పాటించడం వల్ల సమస్యని త్వరగా దూరం అవుతుంది . ఇప్పుడు ఆ చిట్కాలు మీకోసం.*

IMG 20241110 WA0085

*👉1.పాలు, తేనె..*

 

పడుకునే ముందు రోజూ గోరువెచ్చని పాలల్లో ఓ స్పూన్ తేనె వేసుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల హాయిగా నిద్రపడుతుంది. మధ్యలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రెగ్యులర్‌గా ఈ పాలు తాగడం వల్ల మెల్లగా నిద్రలోకి జారుకోవచ్చు. తేనెలో ట్రిప్టోపాన్ ఉంటుంది. ఇది శరీరంలోని సెరటోనిన్, మెలటోనిన్ స్థాయిలను పెంచుతుంది. ఈ కారణంగా శరీరంలో హార్మోన్లు ప్రేరేపితమవుతాయి. ఈ కారణంగా హాయిగా నిద్రపోవచ్చు.

 

*👉2.గోరువెచ్చని పాలు, యాలకుల పొడి..*

 

పాలు తాగడం వల్ల హాయిగా నిద్రపోవచ్చు. వీటిలో కాసింత యాలకుల పొడి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల హ్యాపీగా నిద్రపడుతుంది. ఈ పాల మిశ్రమం నిద్రకు ఉపక్రమించేలా చేస్తుంది

 

ఇలా రెగ్యులర్‌గా చేయడం వల్ల నిద్రలేమి సమస్య త్వరగా దూరం అవుతుంది.

 

*ఇట్లు,*

*మీ ఆయుర్వేద వైద్యులు,*

కంజర్ల హన్మంతరావు పంతులు

Join WhatsApp

Join Now