ఢిల్లీలో మంచు ఎపెక్ట్.. పలు రైళ్లు, విమానాలు ఆలస్యం

ఢిల్లీలో మంచు ఎపెక్ట్.. పలు రైళ్లు, విమానాలు ఆలస్యం

Dec 25, 2024,

ఢిల్లీని పొగమంచు కప్పేసింది. దీని కారణంగా ఢిల్లీలో పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రాజధానికి వెళ్లి.. వచ్చే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. క్యాట్‌-3 లేని విమాన సర్వీసులకు ఆటంకం కలగొచ్చని ఢిల్లీ ఎయిర్‌పోర్టు పేర్కొంది.

విమానాల రాకపోకల గురించి ఆయా సంస్థలను సంప్రదించాలని సూచించింది. అటు జమ్మూకశ్మీర్‌లో హిమపాతం దట్టంగా కురుస్తోంది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రహదారులను మూసివేశారు.

Join WhatsApp

Join Now