ఢిల్లీలో మంచు ఎపెక్ట్.. పలు రైళ్లు, విమానాలు ఆలస్యం
Dec 25, 2024,
ఢిల్లీని పొగమంచు కప్పేసింది. దీని కారణంగా ఢిల్లీలో పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రాజధానికి వెళ్లి.. వచ్చే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. క్యాట్-3 లేని విమాన సర్వీసులకు ఆటంకం కలగొచ్చని ఢిల్లీ ఎయిర్‌పోర్టు పేర్కొంది.
విమానాల రాకపోకల గురించి ఆయా సంస్థలను సంప్రదించాలని సూచించింది. అటు జమ్మూకశ్మీర్‌లో హిమపాతం దట్టంగా కురుస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రహదారులను మూసివేశారు.