అల్లూరి సీతారామరాజు జిల్లా నుండి వివరాల్లోకి వెళితే???
ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వర్యులు నారాచంద్రబాబు నాయుడు డిప్యుటీ సీ యమ్ పవన్ కళ్యాణ్ అల్లూరి జిల్లా లోని అభివృద్ధి కి ఆమడ దూరం లో వున్నా ఏజెన్సీ ప్రాంతం పాడేరు మండలానికి చెందిన దుడ్డు సత్యనారాయణ(మన్యం గాయకుడు) వినయపూర్వకంగా తెలుపుకుంటున్న విన్నపం. అయ్యా… ఒక గ్రామ పరిధికి చెందిన ఒక ఉద్యోగి, సరిగా తన విధులు నిర్వర్తించకపోతే గ్రామం పాడవుతుందని ఆన్లైన్ ఫె్షియల్ హాజరు సిస్టమ్ను ప్రవేశ పెట్టారు. మరి వీరందర్నీ సాశించే రాజకీయ నాయకులకు (*గ్రామ పరిది వార్డు, & సర్పంచ్ ల నుండి, నియోజకవర్గ స్థాయి నాయకుల వరకు ఎందుకు ఈ ఆన్లైన్ పేషియల్ సిస్టమ్ వుండకూడదు? అసలు వీరి రోజువారీ దినచర్య ఏమిటీ? నియోజకవర్గం దాటి వీరు బయటకు వెళ్ళినప్పుడు,ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? నియోజకవర్గం లో ఏ రోజు ఏ మండలాలు విజిట్ చేయాలి, ఆరోజు వాళ్లు తెలుసుకున్న గ్రామ సమస్యలు ఏమిటీ.? ఏడాదికి వీరికి సెలవులు ఎన్ని?అన్న ఒక కట్టుదిట్టమైన సిస్టమ్ ని అమలుచేస్తే నియోజకవర్గం ఎందుకు బాగుపడదు? దాని ద్వారా ప్రభుత్వానికి ఎందుకు మంచి పేరు రాదు? ఇలా లేక పోవడం, వారు ఆడిందే ఆట, పాడిందే పాట ఐపోయి నాయకుల మొకాలు పేపర్లలో తప్ప మాములుగా చూడలేకపోతున్నాం. పోనీ ఏదైనా సమస్యలు చెప్పుకుందాం అంటే వీరి జాడ గూగుళ్ళో కూడా దొరకడం లేదు,కాబట్టీ ఈ విషయం మీద ఆలోచిస్తారని ఆశీస్తూ, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని కోరుకునే వాళ్లలో నేనూ ఒకడిగా…మీ దుడ్డు సత్యనారాయణ (మన్యం గాయకుడు ) పాడేరు అంటూ ఓ పత్రిక ప్రకటనలో తెలిపారు