అన్నదమ్ములను హతమార్చిన మావోలు..
ములుగు జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీస్ ఇన్ఫార్మర్లనే నెపంతో అన్నదమ్ములను కత్తులతో పొడిచి హతమార్చారు. ఈ ఘటన వాజేడు మండలం జంగాలపల్లిలో జరిగింది. మృతులు ఊక అర్జున్, రమేశ్ గా గుర్తించారు. రమేశ్ పంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్నట్లు సమాచారం. కాగా, వాజేడు మావోయిస్టు కమిటీ శాంత పేరిట మావోలు లేఖ వదిలారు.