కెవిపిఎస్ మండల అధ్యక్షులు గా మరాటి బాలస్వామి

కెవిపిఎస్ మండల అధ్యక్షులుగా మరాటి బాలస్వామి

సిద్దిపేట ఆగస్టు 18 ప్రశ్న ఆయుధం :

సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మరాటి కృష్ణమూర్తి అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు బక్కేల్లి బాలకిషన్ హాజరై మండల కమిటీ సమావేశంలో జగదేవ్ పూర్ కెవిపిఎస్ మండల అధ్యక్షులుగా మరాటి బాలస్వామి ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ప్రకటించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు భక్కెళ్లి బాలకిషన్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు నిధులు కేటాయించడంలో విఫలం చెందారని అన్నారు. జనాభా ప్రకారం గల ఎస్సీ ఎస్టీలకు 20 శాతం నిధులు కేటాయించాలని అన్నారు. బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీల పై దాడులు పెరిగాయి అన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మరాఠి కృష్ణమూర్తి, డివిజన్ నాయకులు తుప్ప నాగరాజు, సాయి, మండల అధ్యక్షులు మరాటి బాలస్వామి, మండల నాయకులు కురాడపు బాల్ లింగం, సతీష్, రాజనర్సు, మరాఠీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now