కామారెడ్డి లో బారిగ పట్టుబడ్డ గంజాయి

*బారిగ పట్టుబడ్డ గంజాయి*

కామారెడ్డి జిల్లా ఇంచార్జ్

(ప్రశ్న ఆయుధం )10/7/25

కామారెడ్డి జిల్లా రూరల్ పరిధిలోని నరసనపల్లి రైల్వే గేట్ వద్ద ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి హనుమంతరావు ఆదేశానుసారం మరియు పి సుందర్ సింగ్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలో భాగంగా ఎండు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. అతని వద్ద 550 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతని విచారించగా అతని పేరు అహ్మద్ బిన్ అసద్ తండ్రి పేరు అసద్బిన్ సలాం ప్రస్తుత నివాసం కామారెడ్డి అని విచారణ అనంతరం అతనిని అరెస్ట్ చేసి, అక్రమ రవాణాకు ఉపయోగించిన హోండా ఎక్స్ట్రీమ్ ద్విచక్ర వాహనము నంబరు TG17A0940 నంబర్ గల జప్తు చేయడం జరిగింది. ఇతడు చిన్నచిన్న ప్యాకెట్ల రూపంలో అమ్ముతున్నారనే పక్క సమాచారంతో పట్టుకున్నామని,

జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ వి.సుందర్ సింగ్, సబ్ ఇన్స్పెక్టర్ డి. శరత్ కుమార్,హెడ్ కానిస్టేబుల్స్ బాల్ రెడ్డి, ఆమోస్, అభిషేక్, మరియు కానిస్టేబుల్స్ మారుతి, శ్రీకాంత్ రెడ్డి, నవీన్ కుమార్, సరిత, అపూర్వ మిగతా సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now