మర్కుక్ లో మండల స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్

మండల
Headlines in Telugu
  1. మర్కుక్ మండలంలో 2024 సైన్స్ టాలెంట్ టెస్ట్: విజేతలకు సర్టిఫికెట్ల పంపిణీ
  2. తెలంగాణ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకు ముకి సైన్స్ సంబరాలు
  3. పాములపర్తి పాఠశాల ప్రథమ స్థానం సాధించడం, కేజీబీవీ మర్కుక్ విజయం
  4. సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో విజేతలకు ప్రశంసలు
  5. మండల విద్యాధికారి A. వెంకట రాములు సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో పాల్గొన్న విద్యార్థులకు ప్రోత్సాహం

తెలంగాణ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకు ముకి సైన్స్ సంబరాలు 2024 లో భాగంగా మండల స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్ గురువారం నాడు మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మర్కుక్ లో నిర్వహించడం జరిగింది.ఇందులో ఆంగ్ల మాధ్యమం పాఠశాలల విభాగంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాములపర్తి ప్రథమ స్థానంలో జిల్లాకు ఎంపిక కావడం జరిగింది.ద్వితీయ స్థానం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దామరకుంట వచ్చింది.అదేవిధంగా రెసిడెన్షియల్ పాఠశాల విభాగంలో కేజీబీవీ మర్కుక్ విద్యార్థినులు జిల్లాకు ఎంపికైనారు అనంతరం విజేతలకు సర్టిఫికెట్లను అందించారు.ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక మర్కుక్ మండల విద్యాధికారి A.వెంకట రాములు,కన్వీనర్ వై.చిన్న బ్రహ్మయ్య, స్థానిక పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు భూజాత,పిఆర్టియు మండల అధ్యక్షులు ఆర్.శ్రీనివాసరావు,పాములపర్తి పాఠశాల ఉపాధ్యాయులు ఫణీంద్రుడు,శ్రీనివాస్,మర్కుక్ పాఠశాల ఉపాధ్యాయులు పద్మా రెడ్డి, బుచ్చయ్య,కేజీబీవీ ఉపాధ్యాయురాలు మంజుల తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now