సైన్స్ టాలెంట్ పరీక్షలు నిర్వహణ

సైన్స్
Headlines
  1. మర్కుక్‌లో బయోలాజికల్ సైన్స్ టాలెంట్ పరీక్షలు
  2. బేతి నాగ చైతన్య రెడ్డి, పూజ శ్రీ సైన్స్ టాలెంట్ పోటీలో విజేతలు
  3. మండల స్థాయి సైన్స్ టాలెంట్ పరీక్ష: ప్రతిభ గణనీయమైన విద్యార్థులు
  4. సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థుల ప్రతిభ ప్రదర్శన
  5. జెడ్పిహెచ్ఎస్ పాములపర్తి ప్రథమ స్థానం సాధించింది

మర్కుక్ డిసెంబర్ 9 ప్రశ్న ఆయుధం :

మర్కుక్ మండలంలోని బయోలాజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాములపర్తి లో మండల స్థాయి బయోలాజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ఐదు పాఠశాలల్లో మొదటి,రెండవ స్థానం పొందిన విద్యార్థులకు మండల స్థాయి పోటీలు నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు లతి సైదా అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారి ఏ వెంకట్ రాములు హాజరైనారు. ఈ సందర్భంగా మండల సైన్స్ ఫోరం అధ్యక్షులు వంటేరు శ్రీనివాస్ రెడ్డి మరియు పి ఆర్ టి యు మండల శాఖ అధ్యక్షులు శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి కుమార్ రాష్ట్ర బాధ్యులు షాబుద్దీన్, గణేష్ మరియు మండలంలోని అన్ని పాఠశాలల జీవశాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ జీవశాస్త్ర విషయంలో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులు జిల్లా స్థాయిలో మరింత మెరుగైన ఫలితాలు సాధించి మండలానికి కీర్తి తీసుకురావాలని ఆశించారు. మండల స్థాయిలో గెలుపొందిన విజేతలు బేతి నాగ చైతన్య రెడ్డి జెడ్పిహెచ్ఎస్ పాములపర్తి ప్రథమ స్థానం పొందగా కేజీబీవీ మర్కుక్ చెందిన పూజ శ్రీ రెండవ స్థానం పొందారు. అలాగే తెలుగు మీడియంలో నవ్య, కీర్తన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మర్కుక్ గెలుపొందారు. ఈ సందర్భంగా పరీక్ష కు హాజరైన విద్యార్థులందరికీ సర్టిఫికెట్ మరియు విజేతలకు బహుమతులు అందజేశారు.

Join WhatsApp

Join Now