ప్రింట్ మీడియా బాన్సువాడ అధ్యక్షునిగా మారుశెట్టి హన్మండ్లు
ప్రశ్న ఆయుధం 27 అక్టోబర్ ( బాన్సువాడ ప్రతినిధి )
బాన్సువాడ ప్రింట్ మీడియా అధ్యక్షులుగా సోమవారం మారుశెట్టి హన్మాండ్లు ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. బాన్సువాడ పట్టణంలోని గెస్ట్ హౌస్ లో జర్నలిస్టులు సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రింట్ మీడియా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా అధ్యక్షులుగా మారుశెట్టి హన్మండ్లు కార్యదర్శిగా యూనుస్ ఉపాధ్యక్షులుగా గుండోబా శ్రీనివాస్ కోశాధికారిగా రవికుమార్ లతోపాటు సభ్యులుగా గిరిధర్, రాజేశ్వర్ రెడ్డి బర్ల సుధాకర్,శ్రీకాంత్ రెడ్డి వై.వి ప్రసాద్ మోయిన్ పాల్గుణ,ప్రచేతన్,లు ఉన్నారు.ఈ సందర్బంగా మారుశెట్టి హన్మండ్లు మాట్లాడుతూ…తనపై నమ్మకం ఉంచి ప్రింట్ మీడియా అధ్యక్షుడుగా ఎన్నుకునందుకు ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.జర్నలిస్టుల సమస్యల పరిష్కరానికి కృషి చేస్తారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్టు లు తదితరులు పాల్గొన్నారు.