మార్క్సిజమే మానవాళి విముక్తి మార్గం

మార్క్సిజమే మానవాళి విముక్తికి మార్గం…

 

సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి

 

చేర్యాల సెప్టెంబర్ 28 ప్రశ్న ఆయుధం : 

 

నేడు కులాల పేరుతో ,మతాల పేరు తో, ప్రైవేటీకరణ పేరుతో, మానవ మనుగడ ను హరించే విధంగా నేడు బడా కార్పొరేట్లు ప్రభుత్వాల అండతో కోటీశ్వరులు శతకోటీశ్వర్లుగా అందలం ఎక్కుతూ వీరు అనుసరించే విధానాల వల్ల పేదలు మరింత పేదలుగా మారుతున్నారని ఇది దేశ ప్రగతికి, ప్రజలకు ఆటంకంగా తయారైందని ప్రజల విముక్తికి మార్క్సిజమే సరైన మార్గమని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం రోజున చేర్యాల మండలం శభాష్ గూడెం సిపిఎం పార్టీ గ్రామ శాఖ మహాసభ దాసరి కనకయ్య అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరై న ఆముదాల మల్లారెడ్డి మాట్లాడుతూ నేడు ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రస్తుత అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానమేనని ఈ ప్రభుత్వ విధానాలను ఎండగట్టే మార్గమే మర్క్సిజమని , మార్క్సిజం అజేయమని దీనితో నే సమ సమాజం సాధ్యమవుతుందని అన్నారు. గ్రామంలో ఉన్న స్థానిక సమస్యలపై సిపిఎం కార్యకర్తలు అలుపెరుగని పోరాటాలు నిర్వహించాలని, రైతులను, వ్యవసాయ కూలీలను, గ్రామీణ పేదలను కలుపుకొని ఐక్య సంఘటనతో మార్క్సిజం వెలుగులో పోరాటాలు గ్రామాల్లో నిర్వహించాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతనంగా పార్టీ గ్రామ శాఖ కార్యదర్శిగా దండ్ల రమేష్, సోషల్ మీడియా గ్రామ బాధ్యునిగా బొడ్డు ప్రకాష్ లు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్ల బండి శశిధర్ మండల కార్యదర్శి కొంగరి వెంకట మావో, మండల కమిటీ సభ్యులు మోకు దేవేందర్ రెడ్డి, నాగపురి కనుకయ్య, గొర్రె శ్రీనివాస్, ఎస్ డి ఇస్మాయిల్, మోకు ఇంద్రం, ఆముదాల రంజిత్ రెడ్డి, గంధాల బాలు, ధన్ల కొమరయ్య, బండ కింది సంపత్, నగేష్, గొలుసుల సురేష్, రాజు, కిరణ్, మౌనిక, లలిత, సువార్త, భాను శ్రీ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now