*ప్రపంచ రికార్డు సాధించిన మాస్ సైకాలజికల్ ఫస్ట్ ఎయిడ్ సెషన్
-మనోజాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహణ-
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 11(ప్రశ్న ఆయుధం)
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మనోజాగృతి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని యూనిసెంట్ స్కూల్లో నిర్వహించిన లార్జెస్ట్ మాస్ సైకాలజికల్ ఫస్ట్ ఎయిడ్ సెషన్ ప్రపంచ రికార్డుగా గుర్తింపు పొందింది.
ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన ప్రపంచ రికార్డు యూనియన్ అధికారిణి షరీఫా హనీఫ్ రికార్డు పత్రాన్ని అందజేశారు.
కార్యక్రమంలో జెసిఐ ఇండూర్ పూర్వ అధ్యక్షుడు, విష్వతేజాస్ ట్రైనింగ్స్ అండ్ కౌన్సిలింగ్ సర్వీసెస్ వ్యవస్థాపకులు శ్రీహరి, సంస్థ సభ్యురాలు తేజస్వి పాల్గొన్నారు.
ఇంతకుముందు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో శ్రీహరి కీలక పాత్ర పోషించి ప్రత్యేక గుర్తింపు పొందారు.
మనోజాగృతి స్థాపకురాలు డా. గీతా చల్ల ఈ సందర్భంగా శ్రీహరి, తేజస్వి కి ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ కౌన్సిలర్లు, పీర్ కౌన్సిలర్లు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, ప్రజల్లో పాజిటివ్ ఆలోచనలు ఏర్పరచడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వహించబడింది.