Site icon PRASHNA AYUDHAM

ఘనంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

IMG 20241115 WA04941

ఘనంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూర్ పట్టణంలో అయ్యప్ప స్వాముల ఆహ్వానం మేరకు కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి హనుమాoడ్ల యశశ్విని ఝాన్సీ రెడ్డి హాజరైపాల్గొని స్వామి వారినీ దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకొని, మహా అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దేవస్థాన సభ్యులు ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డికి పూర్ణకుంభాలతో ప్రత్యేక స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశశ్విని ఝాన్సీ రెడ్డి  మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ కార్తీక కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. స్వామి వారిని దర్శించుకోవడం సంతోషకరంగా ఉందని, దేవుని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు ఆయు ఆరోగ్యాలతో,సుఖసంతోషాలతో, సిరి సంపదలతో ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. దైవ అనుగ్రహంతో ప్రతి ఇంట్లో కార్తీకమాసం వెలుగులు వారి జీవితాలలో నింపాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

Exit mobile version