ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 3(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలను శివ్వంపేట మండలం దొంతి గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో శనివారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు, చిన్నపిల్లలకు అన్నప్రాసన, సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. తల్లిపాల విశిష్టతపై అవగాహన కల్పించారు. చిరుధాన్యాలు, పౌష్టికాహారంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించారు.