45 మంది గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు.

45 మంది గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖధికారి కె.వి స్వరాజ్యలక్ష్మి.

నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సాయిమందిరంలో సత్యసాయిబాబా జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా మానవ జీవితంలో మాతృత్వం మహిళలకు ఒక వరమని,గర్భస్థ సమయంలో ప్రతి గర్భవతి సమతుల్య ఆహారం భుజించడం తప్పనిసరి అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె వి స్వరాజ్యలక్ష్మి అన్నారు.శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 99 జన్మదినోత్సవ సందర్భంగా 45 మంది గర్భిణీలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి గర్భిణి గర్భస్థ సమయంలో ప్రసవ సమయంలో ప్రసవానంతర సమయంలో తప్పనిసరిగా పలు జాగ్రత్తలు వహించాలని ఆమె సూచించారు.గర్భస్థ సమయంలో టీకాలు తప్పనిసరిగాతీసుకోవాలని,ప్రతి గర్భిణి ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవించే విధంగా కుటుంబ సభ్యులు ప్రోత్సహించాలన్నారు.సాయి మందిరంలో సామూహిక సీమంతాల కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం వేదయుక్తంగా ఆలయ ప్రధాన అర్చకులు వావిలాల రాజశేఖర్ శర్మ నిర్వహించారు. అనంతరం దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేసి,కార్తీక మాసం కావడంతో దీపారాధన విశేష ఫలితమని వివరించారు.సత్యసాయి మహిళా సభ్యులు శాస్త్రోక్తంగా గర్భిణీలకు సీమంతం కార్యక్రమం పసుపు,కుంకుమ, వస్త్రాలు,పూలు,పండ్లు,ఫలహారాలతో వడినించి ప్రత్యేక పాటలతో సామూహికంగా గర్భిణీలకు సీమంత కార్యక్రమంనిర్వహించారు.

అనంతరంసామూహికభోజనాలు చేశారు.ఈ కార్యక్రమంలో సాయి ప్రశాంతి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు హకీమ్ మురళి,ప్రధాన కార్యదర్శి ఎలిమే ఈశ్వరయ్య,జిల్లా టీకాల అధికారి డాక్టర్ కే.రవికుమార్ నాయక్, వైద్యాధికారులు డాక్టర్ బోనాసి సులోచన,

డాక్టర్ తేజస్విని,డాక్టర్ మేఘనా రెడ్డి,మహిళా కన్వీనర్ మిడిదొడ్డి సువర్ణ,సాయి సభ్యులు సంగీత,శారద,సుప్రజ,కొండూరు లలిత, పావని,తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment