కామారెడ్డిలో భారీ పోలీస్ కమ్యూనిటీ ప్రోగ్రాం

కామారెడ్డిలో భారీ పోలీస్ కమ్యూనిటీ ప్రోగ్రాం

ధ్రువపత్రాలు లేకుండా నడిపిన 210 బైకులు స్వాధీనం

 అనుమానాస్పదంగా ఉన్న ఏడుగురు అదుపులో

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 20

 

గురువారం: జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట కాలనీలో గురువారం భారీ స్థాయిలో పోలీస్ కమ్యూనిటీ ప్రోగ్రాంను నిర్వహించారు. మొత్తం 203 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఏఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు.  ఈ కార్యక్రమంలో భాగంగా ధ్రువపత్రాలు లేని 210 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం, నేరాలను అరికట్టడం, సమాజంలో శాంతి భద్రతలను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వివరించారు. అదనంగా, అనుమానాస్పదంగా తిరుగుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ కమ్యూనిటీ ఆపరేషన్‌లో సీఐలు నరహరి, రామన్, సంతోష్ గౌడ్, ఎస్సైలు, ట్రాఫిక్ పోలీసులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now