ఉద్యమాలకు ఊతమిచ్చిన మాత రమాయి జయంతికి జైజైలు 

ఉద్యమాలకు ఊతమిచ్చిన మాత రమాయి జయంతికి జైజైలు

ప్రశ్న ఆయుధం ఫిబ్రవరి 7: ఆర్మూర్ పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద పలు సామాజిక సంఘాల నేతలైన అంగరి ప్రదీప్, పింజ అశోక్ అధ్యక్షతన మాత రమాయి 127వ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కరైట్ ప్రముఖులు మాట్లాడుతూ తల్లీ రమాయి తన నల్గురి కన్న పిల్లల్ని సమాజానికి త్యాగం చేసిన గొప్ప త్యాగమూర్తి. ఉద్యమ నాయకురాలైన రమాయి “మహాడ్ సత్యాగ్రహం”లో దాడికి గురైన వారిని పరమర్శించారు. స్థానిక మహిళల సమ్మేళనానికి హాజరయ్యేవారు. “కాలరాం మందిర్ ఉద్యమాని”కి అన్ని రకాల సహాయం అందించిన ఘనత ఆమెకే దక్కిందన్నారు. ఉద్యమ నేత డాక్టర్ అంబేడ్కర్ కు మానసిక శాంతిని కల్పించారు. ఇదేకాకుండా షాహు మహారాజ్, ప్రబోధన్కర్ ఠాక్రే మరియు అంబేడ్కర్ లాంటి మహాపురుషుల మధ్య ఉద్యమ చర్చలకు ఊతం ఇచ్చిన స్పూర్తిప్రదాత రమాయి గారంటూ కొనియాడారు. ఆమె ఆదర్శాలను ప్రతి కార్యకర్త అనుసరించాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఆరంభంలో రమాయి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఇందులో కల్పన కదం, పరిమిత పవార్, శిల్పా పవార్, అనురాధ, పద్మిని, రాజు జాదవ్, వికాస్ పవార్, ఇత్వర్ పేట్ లింగన్న, కొక్కర భూమన్న మాదిగ, ఆర్గుల సురేష్, మమత మాలజీ, మూలనివాసి మాలజీ తదితర్లు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now