మధుర నగర్ కాలనీ అభివృద్ధిపై విస్తృత చర్చ

**మధుర నగర్ కాలనీ అభివృద్ధిపై విస్తృత చర్చ – సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: ముప్పు శ్రీనివాస్ రెడ్డి**

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం జులై 6

నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు, మధుర నగర్ కాలనీ అభివృద్ధి మరియు సమస్యల పరిష్కారంపై ఆదివారం నాడు కాలనీ అధ్యక్షుడు నారాయణ నివాసంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాలనీ వాసులతో కలిసి ఆయన మౌలిక సదుపాయాల సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు.

డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు, వీధి లైట్లు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై నివేదికలను పరిశీలించిన శ్రీనివాస్ రెడ్డి, “కాలనీల అభివృద్ధి కోసం మున్సిపల్ అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటాం” అని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రవీణ్ రాజు, రామకృష్ణ తదితర కాలనీవాసులు పాల్గొన్నారు. స్థానికులు సమస్యల పరిష్కారంపై నిబద్ధతతో స్పందించిన ముప్పు శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment