టి డబ్ల్యూ జే ఎఫ్ ఆధ్వర్యంలో మే డే
– ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ
– కార్మికుల ఐక్య పోరాలాకలతో సమస్యలు పరిష్కారం
– టి డబ్ల్యూ జె ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్
కామారెడ్డి జిల్లా కేంద్రంలో టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్, జెండా ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరాస్కారం కోసం కార్మికులందరూ ఐక్యంగా ఉండి పోరాడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నారు. ఈ మధ్యకాలంలో జర్నలిస్టులపై దాడులు చేయడం మామూలు విషయంగా మారిపోయిందని దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడంతో దుండగులు జర్నలిస్టులపై రెచ్చిపోతున్నారు అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగ ఉండే జర్నలిస్టులకు నేటి రోజుల్లో విలువ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా సెక్రెటరీ కరుణాకర్ .నేషనల్ కౌన్సిల్ నెంబర్ కృష్ణమాచారి . రాష్ట్ర కార్యవర్గ సభ్యులు D.మోహన్ లక్ష్మణ్ .దశరథ్. సంజీవ్. బంగారి. పాల్గొన్నారు