అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి.
కొందుర్గ్ మండలకేంద్రంలో దుర్గా మాత పూజ కార్యక్రమంలో పాల్గొన్న యువనేత మురళీకృష్ణ యాదవ్..
కొందుర్గ్ మండలకేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహా దేవాలయం ఆవరణలో నెలకొల్పిన దుర్గా మాత మండపంలో అమ్మవారి పూజ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పాల్గొన్న బీఆర్ఎస్ యువనేత వై. మురళీకృష్ణ యాదవ్. అనంతరం మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ ఏర్పాటుచేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతా శుభమే కలుగుతుందన్నారు అమ్మవారి కరుణ కటాక్షం షాద్ నగర్ నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖసంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్, నాయకులు రామకృష్ణ, ప్రేమ్, చందు, సాయి తదితరులు పాల్గొన్నారు.. కేపి