కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా మాయావతి జన్మదిన వేడుకలు
– భావి భారత ప్రధాని మాయావతి
– బిఎస్సి పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు హరిలాల్ నాయక్
ప్రశ్న ఆయుధం కామారెడ్డి
ప్రత్యాన్మాయంగా ఆత్మ గౌరవ సమాజాన్ని నిర్మించడం కోసం , తరాలుగా పాలితులుగా ఉన్న బహుజన సమాజాన్ని పాలకులుగా మార్చడం కోసం ,
అహర్నిశలు మాయావతి పనిచేస్తున్నారన్నారు.
అంబేడ్కరిజమే ఊపిరిగా , మహనీయుల ఆశయ సాధనే లక్ష్యంగా , అని చేస్తున్న ఉక్కు మహిళ మన మాయావతి అని, తెలంగాణలో బహుజన్ పార్టీనీ బలోపేతం చేయాలన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు కొక్కొండ రాజేందర్ మాట్లాడుతూ మన మాయావతి
మను వాదుల పాలిట సింహస్వప్నం గా ఉన్నారని, భావి భారత ప్రధాని మాయావతి ని బలపరచి మన బహుజన్ సమాజ్ పార్టీ నీ అధికారం తీసుకు పోయే దిశగా పని చెయ్యాలని అన్నారు. ఈ కార్య్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల సురేష్, జిల్లా ఈసీ మెంబర్ బిమరి భాస్కర్, జుక్కల్ అసెంబ్లీ అధ్యక్షులు రోహిదాస్, కామారెడ్డి అసెంబ్లీ ఉపాధ్యక్షులు జీవన్, సోషల్ మీడియా కన్వీనర్ బాబు , ఎల్లారెడ్డి పట్టణ కమిటీ అధ్యక్షుడు మార్లు సాయిబాబు, కామారెడ్డి మండల అధ్యక్షులు దుబ్బాక నవీన్, పిట్లం మండల అధ్యక్షులు రాములు,తదితరులు పాల్గొన్నారు.