దీర్ఘకాల సమస్యల పరిష్కార ము కోసం మేయర్ విజయలక్ష్మి మరియు బండి రమేష్ జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్నీ కలసి సమస్యలను విన్నవించుకున్నారు
ప్రశ్న ఆయుధం జనవరి 08: కూకట్‌పల్లి ప్రతినిధి

సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మి మరియు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, బండి రమేష్ మరియు జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్ బుధవారం నియోజకవర్గ పరిధిలోని బాలనగర్ అల్లాపూర్ డివిజన్ల లో విస్తృతంగా పర్యటించారు. వీరికి స్థానిక ప్రజలు తమ సమస్యలను విన్నవించుకున్నారు సంబంధిత సమస్యల పరిష్కారం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను వారు ఆదేశించారు. ముందుగా మేయర్ బాలానగర్లోని నాలాను పరిశీలించారు. రెండు బస్తీల మధ్య ఉండే ఈ నాలాకు రిటైనింగ్ వాల్ కట్టడంతో పాటు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని స్థానికులు కోరారు అనంతరం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సప్తర్ నగర్ యూసుఫ్ నగర్ రాజీవ్ గాంధీ నగర్ బస్తీల్లో పర్యటించారు ఇక్కడి నాలాకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ లేకపోవడంతో వరదలు వచ్చిన సమయంలో బస్తీలు మునిగి పోతున్నాయన్నారు. అక్రమ నిర్మాణాలపైన స్థానికులు మేయర్ కు, జోనల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు వీటిని తొలగించాలని కోరారు. దోమల బెడద అధికంగా ఉందని ఫాగింగ్ చేపట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకురాలు, తదితరులు పాల్గొన్నారు
Post Views: 19