బీపీ మండల్ జయంతి ఉత్సవ కార్యక్రమంలోఎంబీసీ చైర్మన్ జేరుపాటి జైపాల్
ప్రశ్న ఆయుధం,ఆగస్టు 11,శేరిలింగంపల్లి, ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర బీసీ వేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో బిపి మండల్ జయంతి వారోత్సవాలు…..
.మండల్ కమిషన్ చైర్మన్ బిందేశ్వర్ ప్రసాద్ మండల్ జయంతి ఉత్సవాల సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రముఖ నాయకుడు సీనియర్ ఎంబీసీ చైర్మన్ జైపాల్ ద్వారా బీపీ మండల్ చిత్రపటానికిఘనంగా నివాళులు అర్పించారు. బిపి మండల్ జయంతి
వారో త్సవాలు జరుపుకుంటున్న క్రమంలో ఈరోజు లింగంపల్లి బీసీ కార్యాలయం ఎంబిసి చైర్మన్ మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జైపాల్
బి పి మండల్ చిత్రపటానికి పూలమాలతో
పూలతో సత్కరించి ఘనంగా నివాళులర్పించారు మరియు తెలంగాణ అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ బృందం కూడా పూలదండతో
పూలతో సత్కరించి గొప్పగా నివాళులర్పించారు బిపి మండల్ జిందాబాద్ బీపీ మండల్ అమర్హ్ హై బిపి మండల్ ఆశయాలను సాధిస్తాం బీపీ మండల్ యొక్క 40 సిఫారసులను సరైన మార్గం ప్రకారం పార్లమెంట్ ద్వారా అమలు చేయాలి అని నినాదాలతో జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ సంతోషంతో నివాళులర్పించారు. బేరీ రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ ముఖ్యంగా బిపి మండల్ గారి 40 సిఫార్సులను వెంటనే అమలు చేయాలని రాజకీయ ఆర్థిక సామాజిక న్యాయం కొరకు రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు అమలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది పేదరిక నిర్మూలనలో భాగంగా బీసీ
లం దరి యొక్క ఓట్లతో అధికారం సాధించాలని భారత సమాజంలో ధనవంతులు నిరుపేదల మధ్య అంతరాళ్లు పెరిగిపోయినందున బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరికీ పేదరిక నిర్మూలన సమస్యను దూరం చేసుకోవటానికి పోరాటమే ఏకైక మార్గం మరియు అందరు ఏకమై గ్రామస్థాయి నుండి ఢిల్లీ వరకు రాజకీయ అధికారం సాధించుకొని
ప్రణాళిక ద్వారా అన్ని సమస్యలు ముఖ్యంగా విద్య ఉద్యోగం ఉపాధి వైద్యం మరియు అన్ని రకాల బీసీలు అభివృద్ధి చెందుటకు పోరాటం చేయాలి ఉద్యమంతో అధికారం సాధించాలి అప్పుడే మన సమస్యలు తీరగలని పేర్కొన్నారు .
బిసి ఎంబీసీ చైర్మన్ జైపాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడమే కాకుండా బీసీల సంక్షేమానికి పాటుపడుతుందని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అగ్రవర్ణ ముఖ్యమంత్రి నిర్ణయాలతో అధికారం తీసుకొని బీసీల సంక్షేమం దృష్ట్యా అన్ని విధాల బీసీలకు సాహయం చేస్తున్నారని ఈ మధ్యనే శ్రీహరి కి మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది. బీసీలకు ఎలాంటి అన్యాయం జరిగిన మా వద్దకు రండి నేను అన్ని విధాల మీకు సహాయం చేస్తాను నా పరిస్థితి దాటి ఉంటే ముఖ్యమంత్రిని కలిసి చర్చించి బీసీల సమస్యలు తీరుస్తానని జయపాల్ చెప్పడం జరిగింది ముఖ్యంగా ఎన్నికల్లో సర్పంచులు ఎంపిటిసి జెడ్పిటిసిలు ఎక్కువగా గెలవటానికి ఆస్కారం ఉంది కాబట్టి పోటీ చేసి గెలవాలని సూచించడం జరిగింది. ఆర్కే సాయన్న ముదిరాజ్ బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుండి ఢిల్లీ వరకు అన్ని విధాల బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంది వార్డు మెంబర్ నుండి ఎంపీ వరకు మనం ఏకమై ఓటువేసుకుంటే మనదే అధికారం అవుతుంది పార్లమెంట్ లోనూ అసెంబ్లీలోను సత్తా చాటాలని
గ్రామీణ ప్రాంతం నుండి కార్పొరేషన్ లోను కార్పొరేటర్లను గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు ముఖ్యంగా బీసీలకు జరుగుతున్న అన్యాయం రాజకీయ సామాజిక ఆర్థిక ఫలాలు మనం పొందటానికి ఉద్యమం చేయక తప్ప దు బీసీలు ఏకమై ఎస్సీ ఎస్టీ మైనారిటీష్లను కలుపుకొని పోరాటం చేసి అధికారం సాధించాలని పిలుపునిచ్చారు ఇందులో భాగంగా బీసీలందరూ సంఘాలు కులాలు అందరూ కలిసి ఉద్యమానికి అందరూ సహకరించి బలోపేతం చేయాలని పేర్కొనడం జరిగింది ఈ సమావేశంలో ఎంబీసీ చైర్మన్ జైపాల్ తో పాటు తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్. కె. సాయన్న ముదిరాజ్ శేరిలింగంపల్లి సంక్షేమ సంఘం అధ్యక్షులు అడ్వకేట్ రమేష్ యాదవ్ ప్రధాన కార్యదర్శి బి కృష్ణ
ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మరియు బీసీ సంక్షేమ సంఘండి ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్ శ్రీరామ్ సైదులు శేర్లింగంపల్లి మహిళా అధ్యక్షురాలు లలిత రాణి కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు విజయలక్ష్మి ఎంఐజి అధ్యక్షురాలు సంగమ్మ మరియు మహిళలు అభిమానులు అందరు పాల్గొని బిపి మండల్ చిత్రపటానికి దండలతో సత్కరించి ఘనంగా నివాళులర్పించారు.