ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 27 (ప్రశ్న ఆయుధం):
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎల్లారెడ్డి మండల పరిధిలోని మండల పరిషత్ టెరిటోరియల్ కౌన్సిలర్ (ఎంసీటీసీ) స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వివిధ కేటగిరీలకు చెందిన సీట్ల వివరాలను అధికారులు వెల్లడించారు.
తాజాగా ఖరారైన రిజర్వేషన్ల ప్రకారం:
అన్నసాగర్: జనరల్ – మహిళ
ఆడివిలింగల్: ST – మహిళ
బిక్కనూర్: జనరల్ – జనరల్
జంగమయిపల్లి: BC – జనరల్
కళ్యాణి: SC – జనరల్
మాచాపూర్: BC – మహిళ
రుద్రారం: BC – జనరల్
వెల్లుట్ల: జనరల్ – జనరల్
అదనంగా, ఎల్లారెడ్డి మండలంలోని MPP స్థానాన్ని అన్రిజర్వ్డ్ జనరల్ కోసం, మఎల్లారెడ్డి JPTC స్థానాన్ని అన్రిజర్వ్డ్ మహిళలకు కేటాయించారు.
ఈ రిజర్వేషన్లు అధికారిక గెజిట్ ప్రకారం అమలులోకి రాబోతున్నాయి. రాబోయే ఎన్నికల్లో స్థానికులు తమ అభ్యర్థులను ఎంచుకునే సమయంలో ఈ రిజర్వేషన్ల పాత్ర కీలకంగా ఉంటుంది.