రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు తడగొండ వాసి ఎంపిక..
ఎండి బఫత్ ఖాజా..
బోయినిపల్లి , ఫిబ్రవరి, 04
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం నుండి అదిలాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన ఎండి బఫాత్ ఖాజా ఎంపికయ్యారు.ఈ నెల 4వ తేదీ నుండి 7వ తేదీ వరకు జరిగే 71 వ రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడల్లో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎండి బఫత్ కాజా ఎంపిక కావడంతో జిల్లా కబడ్డీ అసోసియేషన్, మాజీ సర్పంచ్ రమేష్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ వరలక్ష్మి కనకయ్య, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, కబడ్డీ అసోసియేషన్ అభినందించారు.